FbTelugu

బీజేపీలోకి మరో క్రీడాకారిణి పీటీ ఉష

తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కేరళలో ఈసారైనా పాగా వేయాలనే పట్టుదలో బీజేపీ అడుగులు వేస్తున్నది.

సినీ ప్రముఖులు, క్రీడాకారులు, ప్రముఖ వ్యక్తులను చేర్చుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నది. మెట్రో మ్యాన్ శ్రీధరన్ చేరేందుకు సిద్ధం కాగా మరో క్రీడాకారిణి పిటీ ఉష కూడా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. మాజీ అథ్లెట్ అయిన పీటీ ఉష ఇటీవల బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నది. నూతన వ్యవసాయ సాగు చట్టాలను సమర్థిస్తూ ట్వీట్లు చేసింది. వ్యతిరేకించే వారి వ్యాఖ్యలను ఖండించింది. అయితే ఈ వార్తలపై ఆమె బహిరంగంగా స్పందించేందుకు మీడియా ముందుకు రాలేదు.
ఉత్తరప్రదేశ్ లో ఓటమి పాలైన రాహుల్ గాంధీ ఈ రాష్ట్రం నుంచి ఎంపీ గా గెలుపొందారు. దీంతో ఆయన కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లు సంపాదించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.