* 3.60 లక్షల యువత ఓటుహక్కు కోల్పోతారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతి ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. గుంటూరుకు చెందిన అఖిల అనే విద్యార్థిని ఈ పిటిషన్ ను దాఖలు చేసింది.
తన పిటిషన్ లో పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఆర్టికల్ 326 ప్రకారం 2019 ఓటర్ల జాబితాను అనుసరించి ఎన్నికలను నిర్వహిస్తే 3.60 లక్షల మంది యువత ఓటు హక్కును కోల్పోతారంటూ పిటిషన్ లో పేర్కొంది. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు కావడంతో దీనిపై హైకోర్టు రేపు విచారణ చేపట్టే అవకాశముంది.