FbTelugu

‘పంచాయతి’పై హైకోర్టులో మరో పిటిషన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతి ఎన్నికల నోటిఫికేషన్ ను అడ్డుకోవాలంటూ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో పంచాయతి ఎన్నిలకలు నిర్వహణకు ఇప్పటికే హైకోర్టు, సుప్రీం కోర్టులు పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఇవాళ న్యాయవాది శివప్రసాదరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

తన పిటిషన్ లో ఎన్నికల నోటిఫికేషన్ ను అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరుపుతామని హైకోర్టు తెలపగా.. ఎల్లుండే ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నందున్న విచారణ త్వరగా చేపట్టాలని శివప్రసాదరెడ్డి కోరారు. శివప్రసాదరెడ్డి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు రేపు విచారించనున్నట్టు పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.