FbTelugu

తెలంగాణకు మరో నిజాం వచ్చాడు: సీఎం యోగి

హైదరాబాద్: నిజాం రూపంలో ఉన్న ఒక కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నదని, దానిని సాకారం కాకుండా‌ చూడాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు అంతర్గత పొత్తులు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇవాళ నగరంలో ఆదిత్యనాథ్ కుత్బుల్లాపూర్, గోషామహల్ నియోజకవర్గంలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, బిహార్ లో నితీష్ ప్రభుత్వం ఏర్పడ్డాక, శాసన సభలో ప్రమాణం చేసే సమయంలో ఒక ఎంఐఎం ఎమ్మెల్యే హిందుస్తాన్ అనే పేరు పలికేందుకు ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు. ఎంఐఎం నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు

మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన్, ఆరోగ్య భీమా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని యోగి వివరించారు. హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా మార్చేందుకు మీ అందరితో కలిసి నడిచేందుకు వచ్చానన్నారు. నిజాం కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి, సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ఏక్తా ద్వారా దేశంలో విలీనం చేసారన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ దేశంలో విలీనం చేసేందుకు చేసిన ప్రయత్నాలను సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ విఫలం చేసి భారత దేశంలో విలీనం చేసారని యోగి అన్నారు.

బీజేపీనే హైదరాబాద్ ను భాగ్యనగర్ గా మార్చుతుందని, ఇప్పటికీ కొంతమంది నిజాం వారసులుగా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ, అత్యాచారలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి అరాచక, మతతత్వ శక్తులకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక అధికారాలు కట్టబెట్టారు. అలాంటి దుర్మార్గపు చట్టాలను, ఆర్టికల్ ను మోదీ ప్రభుత్వం రద్దు చేసి కాశ్మీర్ లో ప్రతి భారతీయుడు భూమిని కొనే హక్కును కల్పించారని యోగి అన్నారు.
అయోధ్యలో రామ మందిరం కొరకు అనేక మంది హైదరాబాద్ నుంచి వచ్చారని, రామమందిరం నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు కల్పించారన్నారు. ప్రధాని మోదీ రామ మందిరం నిర్మాణం కోసం భూమి పూజ చేసిన ఘనత దక్కించుకున్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. యూపీలో 30 లక్షల మందికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు కట్టించామని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు ఏళ్ళలో ఎంతమందికి ఇండ్లు ఇచ్చారో బహిరంగ పర్చాలని ఆయన సవాల్ చేశారు. ప్రధాన్ మంత్రి పేద రైతులకు రూ.6వేలు బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుండగా.. వరద సహాయాన్ని అర్హులకు బ్యాంకు ఖాతాల ద్వారా ఇవ్వకుండా టీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా ఎందుకు పంపిణీ చేసిందో సమాధానం చెప్పాలని యోగి సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.