FbTelugu

దక్షిణాఫ్రికాలో మరో కొత్త వైరస్

* స్ట్రెయిన్ కంటే ప్రమాదమంటున్న నిపుణులు
* విమాన సర్వీసులు రద్దు చేసిన అనేక దేశాలు
ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేయగా.. బ్రిటన్ లో కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ ఆవిర్భవించి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా అయింది. ఇదిలా ఉండగా.. సౌత్ ఆఫ్రికాలో కరోనా మరోకొత్త వైరస్ ఉద్భవించింది.

ఈ వైరస్ బ్రిటన్ లో ఉద్బవించిన స్ట్రెయిన్ వైరస్ కంటే ప్రమాదకరమని నిపుణులు తెలుపుతున్నారు. సౌతాఫ్రికా నూతన కరోనాకు 501.V2 గా నామకరణం చేశారు. తాజా పరిణామంతో సౌతాఫ్రికా నుంచి యూకేకు అన్ని విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.