FbTelugu

కోలుకున్న పిల్లలకు మరో కొత్త వ్యాధి

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాకు మరో కొత్త సమస్య వచ్చిపడింది. ఇప్పటికే కరోనా కోరల్లో విలవిలలాడుతున్న అమెరికాలో కరోనా నుంచి కోలుకున్న చిన్న పిల్లలకు ఓ అంతుచిక్కని కొత్త వ్యాధి సోకుతోంది. న్యూయార్క్ లో 52 మంది చిన్న పిల్లల్లో ఈ వ్యాధిని గుర్తించినట్టు తెలిపారు.

ఈ వ్యాధి ప్రభావంతో శరీరం మొత్తం ఎర్రగా మారిపోయి రక్తనాళాలు ఉబ్బుతున్నట్టు తెలిపారు. ఈ వ్యాధిని కవాసాకీ లేదా టాక్సిషాక్ సిండ్రోమ్ గా వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధితో ఐదుగురు చిన్నపిల్లలు మృతి చెందినట్టు తెలిపారు.

You might also like