FbTelugu

శానిటైజర్ తాగి మరో వ్యక్తి మృతి

తిరుపతి: శానిటైజర్ తాగి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లాలోని చంద్రగిరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక చంద్రగిరిలో నివాసం ఉంటున్న శివ అనే యువకుడు శానిటైజర్ తాగడంతో మృతి చెందాడు.

మృతుని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ముందుకు రాలేదు. శివ ఉపాధి కోసం ప్రకాశం జిల్లా మిట్టపాలెం నుంచి ఉపాధి కోసం చంద్రగిరికి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. మద్యం ధరలు పెరగడంతో మత్తు కోసం శానిటైజర్ తాగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

You might also like