FbTelugu

జనావాసాల్లోకి మరో చిరుత

కామారెడ్డి: జనావాసాల్లోకి మరో చిరుత ప్రవేశించి స్థానిక ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన ఘటన జిల్లాలోని సదాశివనగర్ మండలం, లింగంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. లింగంపల్లి గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి ఊరిచివర పశువులను మేపుతుండగా.. సడెన్ గా ఓ చిరుత అక్కడికి వచ్చింది.

భయంతో పరుగులు తీసిన పశువుల కాపరి.. గ్రామంలోని వారికి తను చూసిన విషయాన్ని తెలిపాడు. తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో చిరుతలు, పెద్దపులులు సంచరిస్తూ.. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.