FbTelugu

మల్కాపూర్ లో మరో చిరుత తీవ్ర కలకలం

కరీంనగర్: తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా పెద్దపులుల, చిరుతల గాండ్రింపులు ఎక్కువౌతున్నాయి. అడవిని వదిలి చిరుతలు, పెద్దపులులు జనావాసాల్లోకి వస్తూ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.

తాజాగా మల్కాపూర్‌ గ్రామ శివారులోని ఎఫ్సీఐ ఫిల్టర్ బెడ్ సమీపంలో ఓ చిరుత సంచరించినట్టుగా స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో వారు అక్కడికి చేరుకొని పాదముద్రలు పరిశీలించి అవి చిరుత పాదముద్రలుగా గుర్తించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.