FbTelugu

హైదరాబాద్‌లో మరో కి‘లేడీ’ భాగోతం బట్టబయలయ్యింది

హైదరాబాద్‌లో మరో కి‘లేడీ’ భాగోతం బట్టబయలయ్యింది. అధిక వడ్డీలు ఆశచూపి వందల కోట్లు కోట్టేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల్లో పలువురు ప్రముఖుల ఉండటం గమనార్హం. రూ.కోట్లలో వసూలు చేసిన వ్యాపారవేత్త శిల్ప అలియాస్ శిల్పా చౌదరిని నార్సింగ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్లను ఆమె మోసం చేసినట్లు గుర్తించారు.  పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలను శిల్ప ఆకర్షించినట్లు తెలుస్తోంది.

ఆమె మోసాలపై పలువురు ప్రముఖులు ఒక్కొక్కరిగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శిల్పతో పాటు ఆమె భర్తను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురి ప్రముఖులతో పరిచయాలను క్యాష్ చేసుకున్నారు. మొత్తం రూ.100 కోట్లకుపైగా వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతూ ఉందని అంటున్నారు

You might also like

Leave A Reply

Your email address will not be published.