FbTelugu

రామతీర్థంలో మరో భారీ నిరసన: సోము వీర్రాజు

అమరావతి: ఎల్లుండి (జనవరి 04న) రామతీర్థంలో మరో భారీ నిరసన చేపట్టనున్నట్టు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఇవాళ ఢిల్లీ పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై ఇవాళ రామతీర్థంలో బీజేపీ, టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టగా.. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టబోతున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలందరూ ఈ నెల 4న రామతీర్థం వెళ్తామని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.