FbTelugu

‘మాయా’ కాంబినేషన్లో మరో హారర్ మూవీ!

‘మాయా’ కాంబినేషన్లో మరో హారర్ మూవీ!
నయనతార కథానాయికగా కొంతకాలం క్రితం ‘మాయా’ అనే సినిమా వచ్చింది. ఈ కథ హారర్ థ్రిల్లర్ జోనర్లో నడుస్తుంది. ఒక తల్లి ఆత్మ తన కూతురును కాపాడుకోవడం కోసం పడే ఆరాటమే ఈ సినిమా. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ కథ నడుస్తుంది. దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ సినిమాతో మంచి పేర్ఉ తెచ్చుకున్నాడు.
ఈ సినిమా నయనతార కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. మళ్లీ ఇంతకాలానికి అదే దర్శకుడు నయనతారతో మరో హారర్ సినిమాను రూపొందిస్తున్నాడు .. ఆ సినిమా పేరు .. ‘కనెక్ట్’. నిన్న నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

నయనతార – విఘ్నేశ్ శివన్ కలిసి నిర్వహిస్తున్న రౌడీ పిక్చర్స్ బ్యానర్ పైనే ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో అనుపమ్ ఖేర్ .. సత్యరాజ్ కనిపించనున్నారు. గతంలో ‘మాయా’ సినిమా తెలుగులో ‘మయూరి’గా వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.