చెన్నై: తమిళనాడులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో మారు అక్రమంగా తరలిస్తున్న బంగారం భారీగా పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి భారత్ కు వచ్చిన కొందరు ప్రయాణికులు అక్రమంగా బంగారాన్ని తీసుకువచ్చారు.
అధికారులు తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది. మొత్తం ఐదుగురు ప్రయాణికుల నుంచి 3.46 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారంతో పాటూ ల్యాప్ టాప్ లు సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.