FbTelugu

బిస్కెట్లు తిన్న మరో బాలిక మృతి

కర్నూలు: మ్యాంగో బిస్కెట్లు తిన్న మరో బాలిక మృతి చెందిన ఘటన జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. బి.జమాల్ అనే బాలిక మ్యాంగో బిస్కెట్లు తిని తీవ్ర అస్వస్థతకు గురైంది.

దీంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. ఇప్పటికే మ్యాంగో బిస్కెట్లు తిని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్దారు. తాజాగా జమాల్ మృతితో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

You might also like