FbTelugu

బెజవాడలో మరో గ్యాంగ్ వార్

విజయవాడలో గ్యాంగ్ వార్ లు రోజు రోజుకి ఎక్కువౌతున్నాయి. తాజాగా మున్నా, రాహుల్ అనే ఇద్దరు వ్యక్తుల వర్గాల మధ్య గ్యాంగ్ వార్ జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాత కక్షలతోనే ఈ గొడవలు జరిగినట్టుగా అనుమానిస్తున్నారు.

గత నెల 31న కేదారేశ్వరరావు పేటలో కత్తులు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు 11 మంది నిందితులని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. గత కొన్ని రోజుల క్రితమే గ్యాంగ్ వార్ లో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

You might also like