FbTelugu

సాగర్ జలవిద్యుత్ కేంద్రంలో మరో అగ్నిప్రమాదం

నల్లగొండ: జిల్లాలోని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రంలో ఇవాళ మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ట్రాన్స్‌ ఫార్మర్‌ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఉద్యోగులు చాకచక్యంతో వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో అక్కడ పెను ప్రమాదమే తప్పింది. ఆకస్మాత్తుగా మంటలు ఎలా వచ్చాయన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై అప్రమత్తమైన అధికారులు ప్రమాదం పట్ల విచారణ చేపట్టినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.