FbTelugu

ఆరోగ్య సేతు యాప్ లో మరో ఫీచర్

ఢిల్లీ: కరోనా మహమ్మారి కోసం ప్రారంభించిన ఆరోగ్య సేతు యాప్ లో మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టారు. వ్యాపార, వాణిజ్య సంస్థ కార్యకలాపాలకు తోడ్పడే విధంగా ఓపెన్ ఎపీఐ సర్వీసును కొత్తగా తీసుకువచ్చింది.

వ్యాపార సంస్థ సరికొత్త విధానాన్ని ఉపయోగించడం ద్వారా తమ ఉద్యోగులు, ఈ యాప్ ను ఉపయోగించే ఇతరుల ఆరోగ్య పరిస్థిత తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇందుకు యూజర్ల నుంచి అంగీకారం తప్పనిసరి చేశారు. వ్యక్తిగత సమాచారానికి భంగం కలుగకుండా యాప్ ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.
ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు 30వేల పాజిటివ్ కేసులను కనుగొన్నారు. వారిని అప్రమత్తం చేయడంతో పాటు చికిత్స ఇప్పించగలిగారు. దేశ వ్యాప్తంగా సుమారు 15 కోట్ల మంది దీన్ని ఉపయోగిస్తున్నారు.

You might also like