FbTelugu

మరో రైతు ఆత్మహత్యాయత్నం

Another-farmer-attempted-suicide

కడప: తెలంగాణలో అబ్దుల్లాపూర్ మెట్ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే కడప జిల్లాలో మరో భూ సమస్య ఘటన చోటు చేసుకున్నది. కొండాపురం తహసిల్దార్ వేధింపులు తాళలేక రైతు ఆదినారాయణ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. నిప్పంటించుకునే క్రమంలో రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ముంపు గ్రామమైన దత్తాపురం గ్రామానికి చెందిన రైతుగా పోలీసులు గుర్తించారు. తన తల్లి పేరు మీద ఉన్న డీకేటీ భూమిని తన పేరిట మార్చి నష్టపరిహారం చెల్లించాలని కోరినా పట్టించుకోవడం లేదు. సంవత్సరం కాలంగా వేడుకున్నా రెవెన్యూ సిబ్బంది పెడ చెవిన పెట్టడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు.

You might also like