FbTelugu

సచివాలయంలో మరో ఉద్యోగి మృతి

అమరావతి: ఏపి సచివాలయంలో కరోనాతో మరో ఉద్యోగి మృతి చెందాడు. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఉద్యోగులు మృతి చెందడంతో మిగతా ఉద్యోగులు కలవరపడుతున్నారు.

సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ ఆఫీసర్ జి.రవికాంత్ కరోనాతో మృతి చెందడంపై పలువురు ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం ఉద్యోగులకు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.