FbTelugu

మహిళా ఉద్యోగిపై మరో ఉద్యోగి దాడి

కామారెడ్డి: మున్సిపల్ కార్యాలయంలో ఇంటి పన్ను వసూలు చేసే మహిళా ఉద్యోగి రోజా పై సహచర ఉద్యోగి రామకృష్ణ దాడి చేశాడు. అతని దాడిలో రోజా ముక్కు, మొహానికి తీవ్ర గాయాలు అయ్యాయి.

తనపై దాడి జరిగిందని వెంటనే మున్సిపల్ కమిషనర్ కు ఆమె ఫిర్యాదు చేసింది. అధికారుల సూచన మేరకు పోలీసులకు తెలిపింది. దాడి చేసిన ఉద్యోగి బోధన్ మున్సిపల్ లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేశాడు. దాడి చేసిన రామకృష్ణని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.