FbTelugu

మరోసారి కాల్పులకు తెగబడిన పాక్

జమ్ము కశ్మీర్: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మరోసారి ఉల్లంగించింది. జమ్ము కశ్మీర్ సరిహద్దు బాలాకోట్ సెక్టార్ లో పాకిస్థాన్ బలగాలు ఇవాళ కాల్పులకు తెగబడ్డాయి. పాక్ కాల్పులతో అప్రమత్తమైన భారత బలగాలు వారిని తిప్పికొట్టారు.

ఓ పక్క చైనా దురాగతాలు రోజురోజుకి ఎక్కువౌతుంటే.. మరో పక్క పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. దీంతో భారత పశ్చిమ, ఈశాన్య సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి.

You might also like