FbTelugu

స్పుత్నిక్ లైట్ కు మరో దేశం ఆమోదం

వెనిజులా: కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రష్యా తయారు చేసిన సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ కు వెనిజులా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ వెల్లడించింది.

ప్రస్తుతం రష్యాలో రెండు డోసుల స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ను ఉపయోగిస్తున్నారు. దానికి అడ్వాన్స్ గా స్పుత్నిక్ లైట్ ను సింగిల్ డోసులో తీసుకువచ్చారు. రెండు డోసుల వ్యాక్సిన్ సామర్థ్యం 90 శాతం పైగా ఉండగా సింగిల్ డోసు సామర్థ్యం 79.4 శాతం ఉందని తెలిపింది. సెకండ్ వేవ్ కారణంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగం కింద ఆమోదం తెలిపింది. వచ్చేవారం నుంచి దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సింగిల్ డోసు ధర రూ.982 గా నిర్ణయించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.