FbTelugu

వర్మ మెడలో మరో వివాదం

ఎప్పుడూ వివాదాల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు.

ఇటీవల కాలంలో ప్రముఖుల బయోపిక్‌లు తీసి జనం నోళ్లలో నానిన ఆయన తాజాగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్య తర్వాత అతడి భార్య అమృత కథతో సినిమా తీసేందుకు ప్లాన్‌ చేశారు. దానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను ఆదివారం ఆయన విడుదల చేశారు. ఈ పోస్టర్‌ విడుదలతోనే ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ పోస్టర్‌ చూసిన తర్వాత తన కథ పేరుతో రాంగోపాల్‌వర్మ ప్రకటించిన సినిమాకు, తన జీవితానికి ఏ సంబంధమూ లేదని అమృత విమర్శించారు.

తన కథ తన సన్నిహితులకు ఎవరికీ తెలియదన్నారు. ఆదివారం విడుదలైన పోస్టర్‌ చూసిన తర్వాత తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని అమృత చెప్పారు.పెద్ద పెద్ద ఉపాన్యాసాలిచ్చే ఆయన సినిమాకు ముందు తన కథ తెలుసుకోవాలని తెలియదా అని ప్రశ్నించారు. ఆయన సినిమాలకు ఓ కట్టుకథ అల్లుకొని దానికి మా పేర్లు పెట్టుకొని అమ్ముకోవాలని చూస్తున్నాడని విమర్శించారు. అయితే, వర్మపై కేసు వేసి ఆయనకు పబ్లిసిటీ కల్పించేందుకు తాను సిద్ధంగా లేనన్నారు.

మహిళలను ఎలా గౌరవించాలో చెప్పే తల్లి ఆయనకు లేనందుకు జాలి పడుతున్నానని అమృత చెప్పారు. ప్రతిసారీ సినిమా విడుదలకు ముందు వివాదంలో చిక్కుకుంటున్న వర్మ ఈ సారి కేవలం పోస్టర్‌ విడులతోనే వివాదంలో చిక్కుకోవడం కొసమెరుపు.

You might also like