FbTelugu

ఛాయ్ వాలాతో మరో ఛాయ్ వాలా భేటీ

వరంగల్: ఛాయ్ వాలా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో మాట్లాడే అవకాశం వరంగల్ లోని మరో ఛాయ్ వాలా కు దక్కింది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులు వరంగల్ ఛాయ్ వాలా కు తెలిపారు.

మహమ్మద్ పాషా వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ ఫుట్ పాత్ పై గత 40 ఏళ్లుగా ఛాయ్ బండి నడుపుతున్నాడు. గతేడాది ఆత్మనిర్భర్ పథకం ద్వారా రూ.10వేల రుణం కూడా తీసుకున్నాడు. కరోనా మహమ్మారి కావడంతో ప్రతి వ్యాపారాన్ని ఆన్ లైన్ చేశారు. ఛాయ్ డబ్బులను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా వసూలు చేసి మొదటి స్థానంలో నిలవడంతో కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మన్ కి బాత్ కు వీధి వ్యాపారుల్లో ఎంపిక చేసిన వారిలో మహ్మద్ పాషా కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని వరంగల్ జిల్లా మెప్మా పి.డి భద్రు మహ్మద్ పాషా కు తెలిపాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.