FbTelugu

‘నోముల’ స్థానానికి మరో ఉపఎన్నిక

నాగార్జున సాగర్ : ఇటీవలే దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గానికి ఉపఎన్నిక జరగగా.. బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. తాజాగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో హఠాన్మరణం చెందారు. దీంతో నాగార్జున సాగర్ లోనూ ఉపఎన్నికలు జరగనున్నాయి.

దుబ్బాక గెలుపుతో మంచి ఊపులో బీజేపీ నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై కూడా ప్రత్యేక దృష్టిసారించనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఇప్పటికే పార్టీని బలోపేతం చేస్తూ.. పలువురు అగ్రనేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. రేపో మాపో కాంగ్రెస్ నేత విజయశాంతి కూడా కమలం గూకికి చేరనున్నట్టు వార్తలొస్తున్నాయి. సాగర్ స్థానానికి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పోటీకీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేసి పోటీ చేయనున్నట్టు పలువురు భావిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.