FbTelugu

ఏపి సర్కార్ కు హైకోర్టులో మళ్లీ ఎదురు దెబ్బ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జిఒ నెంబర్ 2 ను ఏపి హైకోర్టు సస్పెండ్ చేసింది.
గ్రామ పంచాయితీ సర్పంచులు, సెక్రటరీలు అధికారాలను కత్తెరించి గ్రామ రెవెన్యూ అధికారులు (విఆర్వోలు)కు అప్పగిస్తూ జారీ చేసిన జిఒ నెంబర్ 2 ను ఇవాళ సస్పెండ్ చేసింది. ఇప్పటి వరకు సర్పంచులు, కార్యదర్శు ఆధ్వర్యంలో జరిగిన పాలనను విఆర్వోలకు అప్పగించడమేంటని హైకోర్టు నిలదీసింది. పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జిఒ ను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్ కృష్ణ మోహన్ పిటిషన్ వేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.