FbTelugu

సుప్రీంకోర్టులో జగన్ కు మరో దెబ్బ

ఢిల్లీ: అమరావతి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టే ను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే కోసం ప్రయత్నించిన ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు అయింది.

రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 107జీఓ ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీఓ ను సవాల్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది. ఈ స్టే ను తొలగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించి, స్టే ఎత్తి వేయడానికి నిరాకరించింది. తమ వాదనలు హైకోర్టులోనే విన్పించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

You might also like