FbTelugu

మరో బ్యాక్టీరియా భూతం వచ్చింది: చైనా

బీజింగ్: కరోనా వైరస్ తో ఇప్పటి ప్రపంచ దేశాలు చిగురుటాకుల మాదిరి వణుకుతుండగా చైనా దేశం మరో భయపెట్టే వార్తను వెల్లడించింది.

మంగోలియా లోని ఖోవోడ్ ప్రావీన్స్ లో ఇటీవల రెండు బుబోనిక్ ప్లేగు వ్యాధి కేసులు నమోదు అయ్యాయి. అడవి ఉడత (మర్మోట్) మాంసం విక్రయించే వ్యక్తి, సోదరుడికి జూలై 1వ తేదీన ప్లేగు నిర్థారణ అయ్యిందని అధికారిక మీడియా జింగ్వా ప్రకటించింది. వీరిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించడంతో పాటు ప్రైమరీ కాంటాక్టులో ఉన్న 146 మందిని ఐసోలేషన్ లో పెట్టారు.

బయన్నూర్ పట్టణంలో మూడో కేసు నమోదు కావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మూడో స్థాయి హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాధి అడవి ఎలుకలు, ఉడుతల్లో ఉండే బ్యాక్టీరీయాల నుంచి  వస్తుంది. ఈ బ్యాక్టీరియా కీటకాల ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధికి 24 గంటల్లో వైద్యం అందించకపోతే రోగి మరణిస్తాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.