FbTelugu

ట్రంప్ పై డెమొక్రాట్ల మరో అస్త్రం

వాషింగ్టన్: అధికారంలోకి వచ్చిన డెమొక్రాట్లు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కంటినిండా నిద్ర లేకుండా చేస్తున్నారు. అభిశంసన నుంచి గట్టెక్కినా ఆయనకు మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి.

క్యాపిటల్ భవనం దాడి ఘటనను రిపబ్లికన్లు అంత ఈజీగా వదిలేలా లేరు. ఉగ్రవాదులు 9/11 దాడి చేసినప్పుడు అప్పట్లో స్వతంత్ర దర్యాప్తపు కమిషన్ ఏర్పాటు చేశారు. అదే తరహాలో క్యాపిటల్ భవనం విషయంలో విచారణ చేయాలని డెమొక్రాట్లు పట్టుబడుతున్నారు. కొందరు రిపబ్లికన్లు కూడా మద్దతు పలుకుతుండడం విశేషం. కమిషన్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఆధారాలు ఉన్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు అంటే విచారణ జరగాల్సిందేనని డెమొక్రటిక్ సెనేటర్ క్రిస్ కూన్స్ స్పష్టం చేశారు. ఈ తరహా విచారణ కోసం కొత్త చట్టం తీసుకురావాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. క్యాపిటల్ భవనాన్ని సురక్షితంగా మార్చేందుకు ఈ దర్యాప్తు మార్గదర్శి అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.