FbTelugu

ఏపీలో కొత్తగా మరో 68 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో ఏపీలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 2,787 కు చేరింది.

నేటివరకు మొత్తం 58 మంది కరోనాతో మృతి చెందారు. ఈ వైరస్ బారి నుంచి కోలుకొని ఇప్పటివరకు 1,913 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 816 కు చేరింది.

You might also like