FbTelugu

 ఏపీలో మరో 462 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ మరో 462 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కాగా కరోనాతో ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 8 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 119 కి చేరింది. ఇవాళ కొత్తగా కరోనా సోకిన వారిలో 407 మంది ఏపీకి చెందిన వారు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 40 మంది ఉన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారు 15 మంది ఉన్నారు. తాజా కొత్త కేసులతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,834 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 5,123 గా ఉంది. కరోనా బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,593 కు చేరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.