FbTelugu

తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది.

అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉన్నట్టు తెలిపింది. వీటి ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణలో అతిభారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇప్పటివరకు రాయలసీమలో 90 శాతం అధిక వర్షపాతం నమోదైనట్టుగా తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.