అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 180 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. నలుగురు కరోనాతో మృతి చెందారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 94 మందికి కరోనా పాజిటీవ్ వచ్చినట్టుగా వైద్యులు తెలిపారు.
విదేశాల నుంచి వచ్చిన మరో ఏడుగురికి కూడా కరోనా వచ్చినట్టుగా తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 68 కరోనా మరణాలు నమోదైనాయి. ప్రస్తుతం ఏపీలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 967 కు చేరింది. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,224 కు చేరింది.