FbTelugu

సోనూసూద్ కు పాలాభిషేకం

కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్న టాలీవుడ్, బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కరోనా కష్టకాలంలో మొహం చాటేశారు. కష్టకాలంలో ప్రజలు పడుతున్న బాధలు పట్టించుకోకుండా ఫొటోలకు పోజులిస్తూ కాలం గడిపారు తప్పితే సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనలేదు.
నటుడు సోనూసూద్ అలా కాకుండా తన వద్దకు వచ్చిన వారికి సాయం చేస్తూ ఏడాది కాలంగా ముందుకు సాగుతున్నారు. ఎంతో మంది అభాగ్యులకు చేయూతనిచ్చారు. వలస కార్మికులను తమ స్వగ్రామాలకు పంపించారు. విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులను రప్పించారు. ఇలా ఎందరికో గతేడాది సాయం చేశారు. సెకండ్ వేవ్ లో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్ లేకపోవడం కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ వార్తలను మీడియాలో చూసిన సోనూసూద్ చలించిపోయారు. తన సేవా కార్యక్రమాన్ని ఏపి నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. తమ జిల్లాలో కూడా ప్లాంట్ ఏర్పాటు చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ అడిగిన వెంటనే అక్కడ కూడా పెడతానని సోనూసూద్ హామీ ఇచ్చారు. ఈ విషయం ప్రజలకు తెలియడంతో సోనూసూద్ ఫోటోకు మహిళలు, యువకులు పాలాభిషేకం చేశారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని టాలీవుడ్ హీరో, హీరోయిన్లు తమవంతు సాయం చేయాలని కర్నూలు, నెల్లూరు జిల్లా వాసులు కోరుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.