FbTelugu

బెంగాల్ ఫలితాలు.. పికె నిష్క్రమణ!

పాట్నా: దేశంలోని పలు రాష్ట్రాలలో ఎన్నికలకు వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ ప్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా ఆయన చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

ఇకనుంచి ఎన్నికల వ్యూహకర్తగా వైదొలగాలని అనుకుంటున్నట్లు ఒక జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు చేసిన సర్వే పనులను ఇక నుంచి చేయాలని అనుకోవడం లేదు. జీవితంలో ఇంకేదో చేయాలని అనుకుంటున్నాను, కావున ఈ సర్వే బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాని ప్రశాంత్ తెలిపారు. రాజకీయాల్లోకి వెళ్తున్నారా అని అడగ్గా, రాజకీయాల్లో విఫలం అయ్యాను, ఏం చేయాలనేది చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.

బెంగాల్ ఎన్నికలు ఏకపక్షంగా జరిగినప్పటికీ హోరాహోరీ పోరు జరిగిందన్నారు. చాలా ఆటుపోట్లను ఎదుర్కొన్నామని, ఎన్నికల కమిషన్ పక్షపాతంలో వ్యవహరించి మా ప్రచారాన్ని చాలా క్లిష్టం చేసిందన్నారు. అయినప్పటికీ ఏమాత్రం సంకోచించకుండా గట్టి నమ్మకంతో క్షేత్రస్థాయిలో పనిచేశామన్నారు. అనుకున్న దానికన్నా టిఎంసిని ఎక్కువ సీట్లలో ప్రజలు కట్టం కట్టారన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.