FbTelugu

అన్నాత్తే షూటింగ్ మళ్లీ మొదలు

అనారోగ్యం కారణంగా వాయిదా పడిన సూపర్ స్టార్ రజనీకాంత్ మువీ అన్నాత్తే షూటింగ్ మళ్లీ పట్టాలెక్కింది. మంగళవారం చెన్నైలో షూటింగ్ మొదలైందని కోలీవుడ్ టాక్ నడుస్తోంది.
రజనీకాంత్ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లి రావడంతో కొలకతాలో జరగాల్సిన షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడింది.

దీంతో ఆయన పాల్గొనే సన్నివేశాలను చెన్నైలోని ఒక స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. రెండు రోజుల షూటింగ్ తో రజనీకాంత్ పోర్షన్ పూర్తికానున్నది. ఆ తరువాత మువీ టీమ్ కొలకతా వెళ్లనున్నది. అక్కడ ఇతర నటీనటులతో కీలక సన్నివేశాలను పూర్తి చేయనున్నారు. శిరుతాయ్ శివ దర్శకత్వంలో అన్నాత్తే మువీని తెరకెక్కిస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తున్నది. మరో హీరోయిన్ కీర్తి సురేష్, ప్రకాశ్ రాజ్, ఖుష్బూ, మీనా కీలక పాత్రల్లో నటిస్తుండగా డి.ఇమ్మాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.