FbTelugu

శరవేగంగా అన్నాత్తె షూటింగ్

హైదరాబాద్ లో అన్నాత్తె సినిమా షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రజనీకాంత్, నయనతార ప్రధాన తారాగణంతో శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నది.

రజనీకాంత్ అనారోగ్యానికి గురికావడంతో షూటింగ్ కొద్ది రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు షూటింగ్ పనులు వేగిరంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ పనులు జరుగుతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం రజనీకాంత్ హైదరాబాద్ రాగా, మంగళవారం నాడు హీరోయిన్ నయనతార వచ్చేసింది. ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ గా నటిస్తుండగా, మీనా, కుష్బూ, కీర్తి సురేష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.