FbTelugu

దర్బంగా పేలుడు కుట్ర విచారిస్తున్నాం: అంజనీకుమార్

హైదరాబాద్: బిహార్ దర్బంగా రైల్వే స్టేషన్ లో పేలుడు కుట్రకు సంబంధించి విచారిస్తున్నామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో కలిసి విచారిస్తున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇమ్రాన్, నాసిర్ లు హైదరాబాద్ లో ఉంటున్నారు. జూన్ 15వ తేదీన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి దర్బంగా కు ఒక పార్సిల్ వెళ్లింది.

అందులో కొన్ని చీరల మధ్యన ఒక బాటిల్ ను పెట్టారు. అది దర్బంగా చేరుకోగానే పేలుడు సంభవించింది. రైలును పేల్చేందుకు కుట్ర జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందడంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. సికింద్రాబాద్ స్టేషన్ లో సిసి కెమెరాల రికార్డు ఆధారంగా యుపిలో ఇద్దరిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇమ్రాన్, నాసిర్ ను హైదరాబాద్ నుంచి బిహార్ కు ఏటిఎస్ అధికారులు తీసుకువెళ్లారు. వీరికి ఇండియన్ ముజాహిదిన్ తో పాటు లష్కరే తోయిబాతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని ఎన్ఐఏ విచారిస్తున్నది. వీరిద్దరూ ఆసిఫ్ నగర్ లో నివాసముంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.