FbTelugu

వైసీపీ ఎమ్మెల్యే ఇంటి ముందు యానిమేటర్ల ధర్నా

Animators-dharna-in-front-of-the-YCP

తాడేపల్లి: మంగళగిరి వైసీపీ ఎమ్యెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇంటిముందు యానిమేటర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. రావాలి ఆర్కే , సమాధానం చెప్పాలి ఆర్కే అంటూ ఇంటిముందు నిరసనకు దిగారు. వైసీపీ అధికారంలోకీ వచ్చిన తరువాత హామీలు అమలుచెయ్యకపోగా రాష్ట్రవ్యాప్తంగా 27 వేల మంది యానిమేటర్ల ఉద్యోగాలు ఊడగొట్టేందుకు సర్క్యులర్ జారీ చెయ్యటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు వచ్చిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆందోళనకు దిగిన డ్వాక్రా యనిమేటర్లను కలిసి మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి హామీ ఇచ్చారు.

You might also like