FbTelugu

కరోనా లెక్కలు దాయడం లేదు: అనిల్ కుమార్

అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు గానీ, మృతులను కానీ దాయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఖండించారు.

కరోనా వైరస్ కేసుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్లలో వివరాలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. రాష్ట్రంలో వైరస్ కారణంగా సంభవించే ప్రతి మరణాన్ని సమీక్షిస్తున్నామన్నారు. ఎక్కడా దీనిపై దాయాల్సిన పనిలేదన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ పైప్‌లైన్‌తో కూడుకున్నవి 26,000 పడకలు అందుబాటులో ఉండగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నది 2 వేల మంది మాత్రమేనన్నారు. రోజుకు 347 కిలోలీటర్ల ఆక్సిజన్‌ అవసరం ఉండగా 500 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం రాష్ట్రంలో ఉందని అనిల్‌కుమార్‌ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.