FbTelugu

భార్యపై కోపంతో.. అత్తపై కత్తితో దాడి!

కర్నూలు: ఓ వ్యక్తి తన భార్యపై ఉన్న కోపంతో.. అత్తపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అత్త పరిస్థితి తీవ్రంగా విషమించింది. ఈ ఘటన జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం, చింతకొమ్మదిన్నెలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని, ఇందుకు కారణం అత్తేనని భావించాడు. అనంతరం ఓ కత్తితో ఏకంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన అత్త పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

You might also like