ఉత్తరాంధ్ర.. గోదావరి తీరంలో మకుటం లేని మహారాజులు. రాజ్యాలు పోయినా.. రాజభోగాలు అలాగే ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా రాజుల వారసులను తమ రాజకీయ ప్రాభవానికి మెట్లుగా వాడుకుని.. వారికి సింహాసనం కట్టబెడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆ రాజుల మధ్య వారసత్వపోరు అనుకోండి.. అహం దెబ్బతినటం వల్ల కావచ్చు.. రచ్చ మొదలైంది. ఇది గతంలో ఎన్నడూలేనంతగా అంతర్గత యుద్ధంగా పరిగణించటమే ఇందుకు కారణం.. సింహాచల ఛైర్మన్ గిరీ అశోకగజపతిరాజు నుంచి సంచయితకు చేరటం నుంచి రాజుల సమరం రాజుకుంది.
క్రమంగా అది విస్తరిస్తూ.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తో మరింత పెరిగింది. ఇప్పుడు వైసీపీ ఎంపీ వర్సెస్ మంత్రి అనేంత వరకూ చేరింది. కొద్దికాలంగా ఎంపీ రఘురాముడు వైసీపీ అంటే అవినీతికి చిరునామా అనేంతగా విమర్శలు కురిపిస్తున్నారు. జగన్ బొమ్మతో తామంతా గెలిచామంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు పొర్లుదండాలు పెడతుంటే.. ఈయన మాత్రం.. తూచ్.. నేనొక్కడిని తప్ప అనేంతగా గేలిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మంత్రి శ్రీరంగనాథరాజు పశ్చిమగోదావరి జిల్లాలోని పోడూరు ఠాణాలో ఫిర్యాదు చేశాదు. పోలీసులు కూడా కేసు నమోదుచేశారు. విజయనగరం బొబ్బిలి కోటలో మొదలైన రాజుల అంతర్వుద్ధం.. నర్సాపురం ఎంపీ పుణ్యమాంటూ పోలీస్స్టేషన్ వరకూ చేరింది. మరి ఇది ఇంతటితో ఆగుతుందా.. మున్ముందు మరింతగా ముదురుతుందా చూడాలి ఏం జరుగుతుందో అంటున్నాయి రాజకీయపక్షాలు.