FbTelugu

ఏపీలో అన్ని ఎంట్రన్స్ టెస్టులు వాయిదా

ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటన

అమరావతి: ఏపీ ఉన్నత విద్యా మండలి పలు ప్రవేశ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నది.

లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలన్నింటిని లాక్ డౌన్ దృష్ట్యా వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

లాక్ డౌన్ కారణంగా ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయని తెలిపింది. దీంతో నిర్ణీత తేదీల్లో వాటి నిర్వహణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రవేశ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది లాక్ డౌన్ తరువాత అధికారికంగా ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో తెలిపింది.

You might also like