FbTelugu

ఆంధ్రా పాజిటివ్ కేసులు 22వేలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల నమోదులో ఊరుకులు పెడుతోంది. గత 24 గంటల వ్యవధిలో 22,204 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

గడచిన 24 గంటల వ్యవధిలో 85 మంది చనిపోగా ఇప్పటి వరకు 8,374 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 12,06,232కి చేరింది. మంగళవారం నాడు 11,128 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. గత 24 గంటల్లో 1,16,367 నమూనాలు పరీక్షించగా, ఇప్పటి వరకు 1,69,50,299 నమూనాలను పరీక్షించారు. జిల్లాల వారీగా నమోదు అయిన పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి. అనంతపురం – 2,304, చిత్తూరు – 1,756, తూర్పుగోదావరి జిల్లా – 2,344, గుంటూరు – 1,972, కడప – 903, కృష్ణాజిల్లా – 1,138, కర్నూలు – 1,985, నెల్లూరు – 1,200, ప్రకాశం – 2,001, విశాఖ – 2,113, విజయనగరం – 1,202, పశ్చిమ గోదావరి జిల్లా – 1,304, శ్రీకాకుళం జిల్లా – 1,982 పాజిటివ్ కేసులు వచ్చాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.