FbTelugu

ఇప్ప‌టికైనా ఆంధ్ర నేత‌‌ల‌కు బుద్దొస్తుందా!

మా చంద్ర‌బాబు అయితే క‌రోనాను త‌ర‌మికొట్టేవాడంటారు ప‌సుపు త‌మ్ముళ్లు. అస‌లు మీ టీడీపీ స్లీప‌ర్ సెల్స్ కావాల‌ని క‌రోనా సెల్స్‌గా మారి వైర‌స్‌ను వ్యాప్తిచేస్తున్నారంటున్నారు వైసీపీ ఘ‌నులు.

29 రాష్ట్రాల్లో ఎక్క‌డా క‌నిపించ‌ని రాజ‌కీయం.. కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్ర‌మే ద‌ర్శ‌న‌మిస్తుంది. క‌రోనా వైర‌స్ విజృంభిస్తూ ఎప్పుడు ఎవ‌రిని బ‌లితీసుకుంటుందో తెలియ‌ని అయోమ‌యంలో క‌ల‌సి న‌డ‌వాల్సిన నేత‌లు. రాజ‌కీయ‌పార్టీలు త‌మ స్వార్ధంకోసం రాజ‌కీయాలు చేస్తున్నారు. మొన్న ఇదే విష‌యాన్ని జ‌న‌సేనాని ప‌వ‌న క‌ళ్యాణ్ అంగీక‌రించారు.

ఇప్ప‌టికైనా రాజ‌కీయాలు ప‌క్క‌న‌బెట్ట‌మంటూ సున్నితంగా విమ‌ర్శించారు. అయినా వైసీపీ, టీడీపీ రెండూ ఎవ్వ‌రూ త‌గ్గేది లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు, క‌ర్నూలు, గుంటూరు, బెజ‌వాడ మూడు రాజ‌కీయంగా కీల‌క‌మైన ప్రాంతాలు. అక్క‌డ ప్ర‌బ‌ల‌తున్న కొవిడ్ 19కేసులు వైద్యుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. కొద్దిరోజుల్లోనే ఏపీలో 1500 పాజిటివ్‌కేసులు న‌మోద‌వుతాయ‌నే ఆందోళ‌న లేక‌పోలేదు.

అయినా నేత‌లు మాత్రం రేప‌టి స్థానిక ఎన్నిక‌ల్లో పై చేయి సాధించ‌టంపై దృష్టిపెట్టారు. ఒక‌నేత మైన‌ర్ల‌కు తాళిబొట్లు పంపిణీ చేస్తాడు. మ‌రో నేత పారిశుద్ద్య కార్మికుల‌తో పూల‌వ‌ర్షం కురిపించుకుంటుంది. మ‌రో ఎమ్మెల్యే చూశారా.. వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేశానంటాడు. ఎంపీగారైతే.. క‌రోనా క‌ర్నూలులో క‌ట్ట‌డి చేయ‌టం పై వాడివ‌ల్ల కూడా కాదంటాడు. మ‌తాల‌కు విడిపోయిన స‌మాజం కూడా వైర‌స్ వ్యాప్తికి ఒక‌రిపై ఒక‌రు నింద‌లు వేసుకునే ప‌నిలో ప‌డ్డారు. దీన్ని స‌ర్దిచెప్పాల్సిన రాజ‌కీయ‌పార్టీలు కూడా త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల‌కు ప్ర‌జ‌ల‌ను పావుల‌గా వాడుకుంటున్నారు. పావ‌లా స‌హాయం చేసి ప‌దిరూపాయ‌ల లాభం పొందాల‌ని చూస్తున్నారు. ఎన్నో ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత‌ల బుద్దులు ఎప్ప‌టికి మార‌తాయ‌నేది మాత్రం క‌రోనా వైర‌స్ ఎప్పుడు అదుపులోకి వ‌స్తుంద‌నే సందేహాన్ని మించిందంటూ మేధావులు చ‌మ‌త్క‌రిస్తున్నారు.

You might also like