FbTelugu

ఏపీలో కరోనా కల్లోలం

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పడగవిప్పింది. గడిచిన 24 గంటల్లో 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు1,20390 కి చేరుకున్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 1676 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి.

గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ తో 65 మంది చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 14 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ మొత్తం 1,213 మంది కరోనా పాజిటివ్ తో ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో మొత్తం 70584 శాంపిల్స్ పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో 2784 మంది వ్యాధి నుండి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం ఇప్పటి వరకు 55406 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. వివిధ ఆసుపత్రుల్లో 63,771 మందికి చికిత్స చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 18, 20, 009 కరోనా పరీక్షలు నిర్వహించారు.

You might also like