FbTelugu

ఆంధ్ర బ్యాంక్ ఆన్లైన్ సేవలు బంద్!

* 3 రోజుల పాటూ నిలిచిపోనున్న ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్
* యూనియన్ బ్యాంకుకు మారుతున్నందున అంతరాయం
* 0 బ్యాలెన్స్ చూపించినా ఆందోళన వద్దని సూచన
హైదరాబాద్: ఆంధ్ర బ్యాంక్ తమ ఖాతాదారులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలిపింది. ఆంధ్ర బ్యాంక్ నుండి యూనియన్ బ్యాంక్ కు ఐటి సిస్టమ్ మారుతున్న కారణంగా తేదీ 8-1-2021 రాత్రి 10:00 గంటల నుంచి 11-01-2021 ఉదయం 6:00 గంటల వరకు ఏటీఎం, ఆన్లైన్ సర్వీస్ మరియు ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ లు పనిచేయవని తెలిపింది.

ఐటీ సిస్టమ్ మారుతున్న క్రమంలో ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులకు ఖాతాలో బ్యాలెన్స్ “0” గా చూపిస్తుందని అయినా అందోళన చేందనవసరం లేదని తెలిపింది. బ్యాలెన్స్ మళ్ళీ తిరిగి ఖాతా దారుల అకౌంట్ లోకి చేరతాయని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.