FbTelugu

ఇక స్పీడ్ పోస్టులో.. శబరిమల ప్రసాదం

శబరిమల : శబరిమల భక్తులకు భారత తపాలా శాఖ ఓ శుభవార్తను తెలిపింది. ఇకనుంచి శబరిమల దేవాలయం నుంచి స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు స్పీడ్ పోస్టుద్వారా చేరవేయాలని భారత తపాలా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేరళ పోస్టల్ సర్కిల్ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డుతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

తాజా నిర్ణయంతో భక్తులు శబరిమల ప్రసాదం ప్యాకెట్ ను రూ.450 చెల్లించి ఏ పోస్టాఫీసు నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యంతో ఒక భక్తుడు ఒకేసారి పది ప్యాకెట్ల ప్రసాదం వరకు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. బుక్ చేసుకున్నవారికి నేతితో కూడిన ప్రసాదంతోపాటు విభూతి, కుంకుమ, పసుపు, అర్చన ప్రసాదం ప్యాకెట్ లు పంపనున్నారు. స్పీడ్ పోస్టు కింద బుక్ చేసుకోగానే వెంటనే భక్తుడికి మెసేజ్ వస్తుంది. బుకింగ్ వివరాలను ప్రసాదం కదలికను వెబ్ సైట్ లో లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

You might also like

Leave A Reply

Your email address will not be published.