FbTelugu

సింహ వాహనంపై అనంతతేజోమూర్తి

తిరుపతి: శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం గోవిందరాజస్వామి సింహ వాహనంపై అభయమిచ్చారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.
మృగాల్లో రారాజు, గాంభీర్యానికి చిహ్నం సింహం.

యోగశాస్త్రంలో సింహం వాహనశక్తికి, శీఘ్రగమన శక్తికి మరో రూపు గా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తారు. అనంత తేజోమూర్తి అయిన స్వామివారు రాక్షసుల మనసులో సింహంలా గోచరిస్తారని స్తోత్రవాఙ్మయం కీర్తిస్తోంది. అందుకే ధీరోదాత్తుడైన శ్రీవారు సింహవాహనాన్ని అధిరోహిస్తారు. ఆ తరువాత ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చందనంల‌తో అభిషేకం జరిపారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.