FbTelugu

ఆనందయ్య మందు ఇప్పుడే కాదు…!

విజయవాడ: నెల్లూరు జిల్లా కలెక్టర్, బొనిగె ఆనందయ్య తో మాట్లాడిన తరువాతే మూడు రకాల మందు పంపిణీ పై నిర్ణయం తీసుకుంటామని ఏపి ఆయుష్ కమిషనర్ కర్నల్ రాములు తెలిపారు.

ఆయన మొత్తం ఐదు రకాల మందులు తయారు చేయగా, మూడింటి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తమ పరీక్షల్లో తేలిందన్నారు. ఆయన కంటి చుక్కల మందు వల్ల హాని జరగదని అనే దానికి ఇంకా శాస్త్రీయ ఆధారాలు లభించలేదన్నారు. కె రకం నమూనాలను కూడా తాము పరిశీలించలేదని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఆనందయ్య తయారు చేసిన మందులు ఆయుర్వేదం కాదని అవి నాటు మందులు ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. కరోనా చికిత్సి తీసుకుంటున్నవారు అల్లోపతి మందులు వాడుతునే ఆనందయ్య మందులు వాడాలన్నారు. కేవలం ఆయన మందులపై ఆధారపడ్డం ఆరోగ్యానికి మంచిది కాదని కర్నల్ రాములు హెచ్చరించారు.

మందుల కోసం పాజిటివ్ సోకిన వారు నేరుగా కృష్ణపట్నం వెళ్లవద్దని, బంధువులు లేదా కుటుంబ సభ్యులు వెళ్లాలని ఆయన కోరారు. పంపిణీ సందర్భంగా కరోనా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.